తెలుగు సామెతలు!
*అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు
* అందితే సిగ... అందకపోతే కాళ్లు
అమ్మబోతే అడి... కొనబోతే కొరివి
* అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు?
* అయ్యవారిని చెయ్యబోతే కోతి అయింది...
* అరచేతిలో వైకుంఠం చూపినట్లు
అందుకు అద్దం చూపినట్లు
* మొగుడు మొట్టితే ఏడవలేదు గాని, * తోడికోడలు నవ్విందని ఏడిచిందట
* ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి * కట్టినట్లు
* ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట!
అడుసుతొక్కనేల కాలు కడగనేల
*పొరిగింటి పుల్లకూర రుచి అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అందనిదాక్ష పుల్లన
*అడుక్కుతినేవాడికి అరవైఆరు కూరలు
*అనువుగానిచోట అధికులమనరాదు.
*అత్తసొమ్ము అల్లుడు దానంచేసినట్టు.
*అనగా అనగా రాగం తినగా తినగా రోగం.
*అనుమానం ప్రాణసంకటం.
*అంగిట్లో బెల్లం ఆత్మలో విషం.
*అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు.
* అందరినీ మెప్పించడం అలువిగాని పని.
*అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు.
*అత్తవారి ఐశ్వర్యంకన్నా పుట్టింటివారి గంజిమేలు.
*అండ ఉంటే కొండ కడిగినట్టే.
*రాజువాడికంటే మొండివాడు బలవంతుడు.
*పిట్టకొంచెం కూత ఘనం.
*కాకి పిల్ల కాకికి ముద్దు.
*గోరంత దీపం కొండంత వెలుగు.
*దూరపు కొండలు నునుపు.
*పోరు నష్టం పొత్తు లాభం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
*మనసుంటే మార్గం ఉంటుంది.
*కోటి విద్యలు కూటి కొరకే.
*సంతోషమే సగం బలం.
*నిదానమే ప్రధానం.
* చెప్పటం కంటే చేయడం మేలు.
*నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.
*అందితే జుట్టు అందక పోతే కాళ్ళు.
*అందితే తియ్యన, అందకుంటే పుల్లన.
* అంధునికి అద్దం చూపినట్లు.
*అంబలి తాగేవాడికి మీసాలెత్తే వాడొకడా!
*"అ ఆ"లు రావు. కానీ అగ్రతాంబూలం మాత్రం కావాలి.
*అకటా వికటపు రాజుకు అవివేక్పిధాని, చాదస్తపు పరివారం.
* అక్క మనది అయితే బావ మన వాడవుతాడా?
*అక్కరకురాని అర్థమెందుకు? అక్కరకురాని చుట్టమెందుకు?
*అక్కర గడుపుకొని తక్కెడ పొయ్యిలో బెట్టినట్లు.
*అక్కర వున్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరిన తరువాత గూద నారాయణ.
*అక్కా చెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్కరాసినట్లు.
*అగ్గువ కొననీయదు, ఫిరం (ఎక్కువ రేటు) తిననీయదు.
*అగ్గువ కొననీయదు, ప్రీతి అమ్మనీయదు.
* అచ్చమ్మ పెళ్లిలో బుచ్చమ్మ శోభనం.
*అచ్చివచ్చిన భూమి అడుగయినా చాలు.
* అచ్చివస్తే హనుమంతుడి మూర, లేకపోతే కోతిమూర.
*అజీర్ణానికి ఆకలి మెండు. • అటుకులు బొక్కేనోరు, ఆడిపోసుకొనే నోరు ఊరుకోవు.
*అడకత్తెరలో చికికన వక్క మాదిరి.
*అడవి లో ఆంబోతై తినాలి, అత్త ఇంట్లో అల్లుడై తినాలి.
* అడిగితే చిరాకు, అడగకపోతే పరాకు.
*అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
*అడుక్కు తినేవాడికి ఆలి అయ్యేకంటే - భాగ్యవంతుడికి బానిస అయ్యేది మేలు.
*అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది.
*అడ్డము దిడ్డము తిరిగెడి తెడ్డెరుగునె పొడి తీపి.
0 కామెంట్లు